ఆ టీజర్‌కు ఎందుకన్ని లైకులంటే..
Judagiri |Updated | February 08th, 2016....
ఆ సినిమా టీజర్, ట్రైలర్ యూట్యూబుల్లో రికార్డ్స్ బ్రేక్ చేసింది. కానీ ఆ సినిమా ఫ్లాపవడంతో అజిత్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకపోయింది. ఆ తర్వాత 'వేదాలం' వచ్చినపుడు వాళ్ల హంగామా మామూలుగా లేదు. కొన్ని గంటల్లోనే ఐదు లక్షల వ్యూస్ వచ్చాయి 'వేదాలం' టీజర్‌కి. ఇక సినిమా విడుదలై హిట్టవడంతో అజిత్ అభిమానులు విజయ్ ఫ్యాన్స్‌ను చూసి కాలర్ ఎగరేశారు.
ఇప్పుడిక విజయ్ అభిమానుల వంతు వచ్చింది. 'తెరి' టీజర్ రావడం ఆలస్యం రికార్డుల అంతు చూసే పనిలో పడ్డారు ఇళయదళపతి ఫ్యాన్స్. ఈ టీజర్ కొన్ని గంటల్లోనే 10 లక్షల వ్యూస్ తెచ్చుకుంది. ఒక్క రోజులోపే లక్ష లైకులు వచ్చాయి. మూడో రోజుకే 40 లక్షల వ్యూస్,2 లక్షల లైకులతో దూసుకెళ్తోందా టీజర్. దేశవ్యాప్తంగా అభిమానులున్న బాలీవుడ్ సూపర్ స్టార్ల సినిమాలకు కూడా ఇలాంటి రెస్పాన్స్ ఉండదు. ఎందుకంటే ఆ హీరోల ఫ్యాన్స్ పని గట్టుకుని ఈ యూట్యూబ్ రికార్డుల మీద పడరు.
తెలుగు హీరోల ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో అతి చేయరు. కానీ అజిత్, విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఈ రికార్డుల్ని చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకుంటున్నారు. అందుకే ఎప్పటికప్పుడు రికార్డులు బద్దలవుతున్నాయి.
0 comments:
Post a Comment