Home /
Uncategories /
ధోని...ఏమైంది నీకు ??
ధోని...ఏమైంది నీకు ??
ధోని...ఏమైంది నీకు ??
Judagiri |Updated |February-24-2016
ఢాకా: ఆసియా
కప్ టీ20 టోర్నీకి ముందు టీమ్‌ఇండియాకు ఆందోళన కలిగించే పరిణామం
చోటు చేసుకుంది. కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు.
అతడికి వెన్నుభాగంలో కండరాలు పట్టేశాయి. అతను బుధవారం బంగ్లాదేశ్‌తో
జరిగే ఆరంభ మ్యాచ్‌లో ఆడటం అనుమానంగా మారింది.
దీంతో
బీసీసీఐ వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్
పార్థివ్ పటేల్‌ను జట్టులోకి తీసుకుంది. ‘‘ప్రాక్టీస్ సందర్భంగా కెప్టెన్
ధోనికి కండరాలు పట్టేశాయి. దీంతో సెలక్షన్ కమిటీ ప్రత్యామ్నాయ వికెట్‌కీపర్‌గా
పార్థివ్‌ను ఎంపిక చేసింది. అతను సాధ్యమైనంత త్వరగా ఢాకాలోని జట్టును
కలుస్తాడు’’ అని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపాడు. గాయాల
భయంతో యువ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను టీమ్‌ఇండియా వ్యూహ బృందం ప్రాక్టీస్‌కు
దూరంగా ఉంచినట్లు తెలిసింది.
0 comments:
Post a Comment