నాన్నకు ప్రేమతో రికార్డ్: జగపతి సమక్షంలో సెలబ్రేషన్స్
Judagiri | Updated |04-2016 : ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాన్నకు
ప్రేమతో' చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ఏలో కూడా విజయవంతంగా
ప్రదర్శించబడుతోంది. ఇప్పటికే 1 మిలియన్ డాలర్ మార్కను దాటిన ఈచిత్రం
కలెక్షన్లు...పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది' రికార్డును బద్దలు
కొట్టింది.
Nannaku Prematho (U/A): మీ టికెట్స్ ను వెంటనే బుక్ చేసుకోండి!
తాజాగా ‘నాన్నకు ప్రేమతో' చిత్రం మరో అరుదైన రికార్డును అందుకుంది. 2
మిలియన్ డాలర్(గ్రాస్) మార్కును అందుకుంది. ఈ సందర్భంగా టెక్సాస్ లోని
డల్లాస్ నగరంలో స్పెషల్ షో ప్రదర్శించారు. నాన్నకు ప్రేమతో చిత్రంలో విలన్
రోల్ పోషించిన జగపతి బాబు ఈ షోకు గెస్ట్ గా హాజరయ్యారు. ఆయన సమక్షంలో 2
మిలియన్ డాలర్ మార్క్ అందుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్
నిర్వహించారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
Jagapathi Babu has attended Nannaku Prematho special screening
‘బాహుబలి', ‘శ్రీమంతుడు' సినిమాల తర్వాత 2 మిలియన్ డాలర్ మార్కు అందుకున్న
మూడో చిత్రం ‘నాన్నకు ప్రేమతో'. ఇక ఎన్టీఆర్ కెరీర్లో 2 మిలియన్ డాలర్
మార్కు అందుకున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. జగపతి బాబు అటెండ్ అయిన
షోతో ‘నాన్నకు ప్రేమతో' సినిమా కలెక్షన్స్ 2,007,386 డాలర్లకు చేరుకుంది.
మరో వైపు ఈ చిత్రం టోటల్ షేర్ రూ. 50 కోట్లను క్రాస్ అయింది. ఈ విషయాన్ని
నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ స్వయంగా వెల్లడించారు. నిర్మాత
బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ - ''ఓ మంచి కథాంశంతో ఎన్టీఆర్ హీరోగా
సుకుమార్ దర్శకత్వంలో నిర్మించిన 'నాన్నకు ప్రేమతో..' చిత్రాన్ని
ప్రేక్షకులు అపూర్వంగా ఆదరించి అఖండ విజయాన్ని చేకూర్చారు. 'నాన్నకు
ప్రేమతో..'లో ఎన్టీఆర్ నటన అద్భుతంగా వుందని, ఇందులో ఓ కొత్త ఎన్టీఆర్‌ని
చూసామని, కుటుంబ సభ్యులందరూ కలిసి చూసి ఆనందించ దగ్గ మంచి సినిమాగా
సుకుమార్ ఈచిత్రాన్ని తీర్చిదిద్దారని అందరూ అభినందిస్తుంటే ఆనందంగా
వుంది. అన్నారు.
ఎన్టీఆర్, రకుల్ ప్రీత్‌సింగ్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, రాజీవ్
కనకాల, అవసరాల శ్రీనివాస్, సితార, అమిత్, తాగుబోతు రమేష్, గిరి, నవీన్
తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫోటోగ్రఫీ:
విజయ్ చక్రవర్తి, ఆర్ట్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్,
ఎడిటింగ్: నవీన్ నూలి, పాటలు: చంద్రబోస్, డాన్స్: రాజు సుందరం, శేఖర్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్, నిర్మాత:
బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్.
0 comments:
Post a Comment