గూగుల్‌ను వెనక్కు నెట్టేసింది..

  Judagiri | Updated: February | 08, 2016..
గూగుల్‌ను  వెనక్కు నెట్టేసింది..
న్యూయార్క్: న్యూస్‌సైట్ల రద్దీలో ఫేస్‌బుక్ గూగుల్‌ను  వెనక్కు నెట్టింది. న్యూస్‌సైట్ల రద్దీపై పర్సాడాట్‌లీ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఫేస్‌బుక్, ట్వీటర్‌లో షేర్ చేసిన లింకులు ఇంటర్‌నెట్ వినియోగదారులకు వార్తల కోసం ప్రధాన వనరుగా మారాయని సంస్థ పేర్కొంది.


మీడియా సైట్లకు సంబంధించి 43 శాతం రద్దీ ఫేస్‌బుక్ వేదికగా నడుస్తోందని, ఈ విషయంలో గూగుల్ ట్రాఫిక్ 35 శాతానికే పరిమితమైందని పర్సాడాట్‌లీ తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ట్రాఫిక్ రేసులో ఫేస్‌బుక్ గూగుల్‌ను అధిగమించడం ఇదే తొలిసారి కాదు. గత అక్టోబరులోనే స్వల్ప ఫేస్‌బుక్ స్వల్ప ఆధిక్యం ప్రదర్శించింది. కానీ ఇప్పుడు ఆ వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

0 comments: