'భారత్ నిరాశ పరిచింది.. అయినా వదిలిపెట్టం'

  Judagiri | Updated: February 09, 2016 
'భారత్ నిరాశ పరిచింది.. అయినా వదిలిపెట్టం'
వాషింగ్టన్: నెట్ న్యూట్రాలిటీ కల్పించి కోట్లాది వినియోగదారులకు ఫ్రీ ఇంటర్నెట్ కల్పించాలని భావించిన ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ భారత్ తీసుకున్న నిర్ణయంతో నిరాశ చెందినట్లు తెలిపాడు. అయినప్పటికీ ఈ విషయాన్ని వదిలేది లేదని భారత్ సహా ప్రపంచ దేశాలలో నెట్ న్యూట్రాలిటీ అందించేందుకు కృషిచేస్తానని చెప్పాడు. ఇంటర్నెట్ సేవలకు సంబంధించి దుమారం రేపిన నెట్ న్యూట్రాలిటీ వివాదానికి సోమవారం ట్రాయ్ తెరదింపిన విషయం తెలిసిందే. వివిధ సైట్ల వినియోగాన్ని బట్టి రకరకాల చార్జీలు విధించడం కుదరదని టెలికం కంపెనీలకు తేల్చి చెప్పింది. ఈ నిబంధన పాటించని పక్షంలో, ఎన్నాళ్లు ఉల్లంఘిస్తే అన్ని రోజులూ రోజుకు రూ.50,000 నుంచి గరిష్టంగా రూ.50 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ఇంటర్నెట్.ఆర్గ్ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని కానీ, భారత్ ఫ్రీ ఇంటర్నెట్ ను కట్టడిచేసిందని అభిప్రాయపడ్డాడు. తమతో పాటు ఇతర సంస్థలు ఇంటర్నెట్.ఆర్గ్ ద్వారా భారత్, ప్రపంచ దేశాలలో ఉచిత ఇంటర్నెట్ సదుపాయాలు కల్పించి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సిద్ధపడగా, ట్రాయ్ తమను అడ్డుకున్నదన్నాడు. 38 దేశాల్లోని కోట్లమంది ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఫేస్ బుక్ వాడతారని.. భారత్ లో కూడా 10 కోట్ల మంది ఫ్రీ ఇంటర్నెట్ వినియోగించుకునే అవకాశం ఉందని వివరించాడు. సోలార్ పానెల్స్, శాటిలైట్స్, లేజర్స్, ఉద్యోగావకాశాలు ఇలా చాలా రంగాల వారికి ఉపయోగపడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇతర విధానాలు ఏవైనా అన్వేషించి ఇంటర్నెట్ ను అందుబాటులోకి తీసుకురావడానికి తమ సంస్థ కృషి చేస్తుందని ఫేస్ బుక్ అధికార ప్రతినిధి తెలిపారు.

0 comments: