బీటెక్, ఎంటెక్ నిరుద్యోగులకు శుభవార్త 

Judagiri |Updated :09,2016 


బెంగళూరు: గ్లోబల్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం విప్రో నిరుద్యోగులకు తీపి కబురందించింది. విప్రోలో 25 వేల ఉద్యోగాల భర్తీకి ఆ సంస్థ యాజమాన్యం పచ్చ జెండా ఊపింది. ఈ విషయాన్ని స్వయంగా విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్ జీ వెల్లడించారు. అయితే ఈ ఉద్యోగాలు కేవలం కర్ణాటక రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయడం గమనార్హం. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. బెంగళూరు పెట్టుబడులకు సరైన ప్రదేశమని, కర్ణాటక దేశంలోనే త్వరితగతిన అభివృద్ధి చెందే రాష్ట్రంగా విలసిల్లాలని ఆయన ఆకాంక్షించారు. త్వరలో ఇతర బ్రాంచీలలో కూడా పెద్ద ఎత్తున సిబ్బందిని నియమించి, తమ సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో హైదరాబాద్ నగరంలో కూడా ఐటీ కంపెనీలు నియామకాలు చేపట్టే అవకాశముందని తెలుస్తోంది.

0 comments: