హత్య చేసి ఫేస్ బుక్ లో పెట్టిన వ్యక్తికి జీవిత ఖైదు

  Judagiri | Updated: February 07, 2016.....
హత్య చేసి ఫేస్ బుక్  లో పెట్టిన వ్యక్తికి జీవిత ఖైదు
మియామి: భార్యను గన్ తో కాల్చి చంపాడు ఓ ప్రబుద్ధుడు. అంతేకాకుండా హత్య చేసిన ఫోటోను ఫేస్ బుక్ లో కూడా పోస్ట్ చేశాడు. భార్య పెట్టే బాధలు భరించలేకే హత్య చేసినట్టు నేరాన్ని అంగీకరించాడు. మియామికి చెందిన డెరెక్ మెడినా(33) తన భార్య జెన్నిఫర్ ఆల్ఫోన్సో(27)ను హత్య చేసి ఆమె ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. 2013, ఆగస్టులో తన ఇంట్లోని వంటగదిలో అతడీ దారుణానికి పాల్పడ్డాడు. 8 సార్లు తుపాకీతో కాల్చి చంపాడు. అయితే కత్తితో తన భార్య బెదిరించడంతో ఆత్మరక్షణ కోసం ఆమెను హత్య చేశానని మొదట నాటకం ఆడాడు.

అయితే పోలీసులకు లొంగిపోయే ముందు జెన్నిఫర్ మృతదేహం ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి తానే ఆమెను హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. 'నేను జైలుకు వెళుతున్నా. నాకు మరణశిక్ష కూడా విధించొచ్చు. ఫేస్ బుక్ మిత్రులను మిస్సవుతున్నా. మీరంతా జాగ్రత్తగా ఉండండి. నా భార్య నన్ను ఎంతగానే వేధించింది. ఆమెను ఎటువంటి వేధింపులకు గురిచేయలేదు. నన్ను మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నా' అంటూ ఫేస్ బుక్ లో రాసుకొచ్చాడు. మెడినాను దోషిగా నిర్ధారించిన అమెరికా కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది.

0 comments: