ఇక భూమిపైనా మూన్‌వాక్ చేయొచ్చు!

| Judagiri Updated: February 08, 2016....
  న్యూయార్క్: చంద్రుడిపై కాలు మోపిన తొలి దేశం తమదేనని అమెరికా గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది. మీకు కూడా అలా చంద్రుడిపై నడిచే అవకాశం వస్తే బావుండునని ఎప్పుడైనా అనుకున్నారా.. అలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ల కోరిక తీరే ప్రత్యామ్నాం ఒకటి త్వరలో అందుబాటులోకి రానుంది. చంద్రుడిపై నడిచే వారు ఎలాంటి అనుభూతికి లోనవుతారో అచ్చం అలాంటి ఫీలింగ్‌నే భూమ్మీద కూడా అందించే కొత్త రకం షూలను అమెరికాకు చెందిన ఒక కంపెనీ రూపొందించింది.

వీటికి ‘20: 16 మూన్ వాకర్’ అని నామకరణం చేశారు. భూమి, చంద్రుడి మీద ఉన్న వాతావరణంలో తేడాకు ప్రధాన కారణం అక్కడ భూమ్యాకర్షణ శక్తి అత్యంత తక్కువగా ఉండటమే. అందుకే ఈ షూలలో అమర్చే ఎన్45 నియోడిమియమ్ అనే ప్రత్యేక అయస్కాంతాలు భూమి ఆకర్షణను నిరోధిస్తాయి. అప్పడు మనకు చంద్రుడిపై నడిచేవారికి ఎలాంటి అనుభవం కలుగుతుందో అలానే ఉంటుంది. ఈ అయస్కాంతాల్లో ఎన్40, 42, 45.. అనే భిన్న రకాల అయస్కాంతాలను ఉపయోగిస్తున్నారు. వీటిలో ఎన్45 అత్యంత శక్తిమంతమైనదనీ.. ధర కూడా అందుబాటులో ఉంటుందని వీటిని రూపొందిస్తున్న పాట్రిక్ జిజిరీ వెల్లడించారు.

0 comments: