చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి సందడి షురూ (ఫోటోస్) 

Judagiri |Updated | February 13, 2016..

  మీ సోషల్ నెట్‌వర్క్‌లో  దీన్ని షేర్ చేయండి దీన్ని ట్వీట్ చేయండి  
 హైదరాబాద్: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతోందని వార్తలు గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. చిత్తురు చెంది ఎన్నారై బిజినెస్ మేన్ (యూఎస్ఏ) ఆమె వివాహం జరుగబోతోంది. ఈ మేరకు మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఫోటో ఇంటర్నెట్లో వైరల్ లా వ్యాపించింది. ఈ ఫోటో చూస్తుంటే చిరంజీవి ఇంట్లో పెళ్లి వేడక మొదలైనట్లు స్పష్టమవుతోంది. ఇటీవల చిరంజీవికి భుజానికి ఆపరేషన్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఫోటోలో ఆయన చేతికి కట్టుతో ఉన్నారు. చిరంజీవి ఫ్యామిలీ ఈ పెళ్లికి సంబంధించిన విషయాలను మీడియాతో పంచుకోవడానికి ఇష్టపడటం లేదు. పవన్ కళ్యాణ్ వచ్చింది అందుకే... కాపు ఐక్య గర్జన అనంతరం జనసేన అధ్యక్ష్యుడుగా పవన్ కళ్యాణ్...కేరళ నుంచి హైదరాబాద్ కు సర్దార్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి వచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1న ఆయన వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి కాపు గర్జన పై తన అభిప్రాయాలు చెప్పారు. ఆ మరుసటి రోజు జెఎహెచ్ఎంసీ పోలింగ్ లో ఓటు కూడా వేయకుండా ఆయన కేరళ వెళ్లిపోయారు. అయితే ఫిబ్రవరి 1 రాత్రి ఆయన ఇక్కడ హైదరాబాద్ లో చిరంజీవి ఇంట్లో గడిపినట్లు సమాచారం. హఠాత్తుగా చిరంజీవి ఇంటికి ఎందుకు వెళ్లారు అనేది ఆసక్తికరమైన అంశం. ఆ సమయంలో చిత్తూరు నుంచి చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ కాబోయే భర్తని, అతని కుటుంబాన్ని చిత్తూరు నుంచి రప్పించారని సమాచారం. వచ్చాక పవన్ కళ్యాణ్ సమక్షంలో వివాహ తేదీ, మిగతా ఫార్మాలిటీస్ ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. బాబాయ్ గా ఇదంతా పవన్ ఉండగా జరిగితే బావుంటుందని చిరంజీవి భావించటంతో పవన్ ఇలా షెడ్యూల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా తన ఇంటికి రమ్మనమని ఇన్వైట్ చేయటానికే చిరంజీవి ఆ రోజు సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ కు వెళ్లి మరీ పిలిచినట్లు సమచారం. వేరే రోజు ఈ పోగ్రామ్ పెట్టుకుందామనుకున్నా..బిజీ షెడ్యూల్ తో దొరకని ఎలాగూ పవన్ ..సిటీకి వచ్చారు కదా అని చిత్తురు నుంచి వారిని రప్పించి పని పూర్తి చేసినట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని మీడియాకు ముందుగా లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి సందడి షురూ (ఫోటోస్) 1/4 పెళ్లి వేడక లానే ఉంది?

0 comments: