ప్రేమికుల దినోత్సవం గ్రీటింగ్‌ కార్డుల దహనం 

 Judagiri |Updated |February 13,2016.

బోధనటౌన్: పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద భజరంగ్‌దళ్‌, వీహెచ్‌పీ నాయకులు ప్రేమికుల దినోత్సవం గ్రీటింగ్‌ కార్డులను దహనం చేశారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజును భజరంగ్‌దళ్‌, విశ్వహిందుపరిషత్ వ్యతిరేకిస్తున్నాయన్నారు. ప్రేమికుల దినోత్సవం మన సంస్కృతి కాదని అది విష సంస్కృతి అన్నారు. విదేశీ పాశ్చత్త సంస్కృతి అయిన ప్రేమికుల దినోత్సవం పేరిట మోసాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో భజరంగ్‌దళ్‌, వీహెచ్‌పీ నాయకులు కోటే శ్వర్‌రావు, హరి, రాజువినోద్‌, శేఖర్‌, కిరణ్‌సాగర్‌, హేమలత, నవీన పాల్గొన్నారు.

0 comments: