రోబోలతో వ్యవసాయం


రోబోలతో వ్యవసాయం

Judagiri |Updated |February 17-2016...

CHITTOOR :-పెరుగుతున్న టెక్నాలజీ మానవాళికి ఎంతో ఉపయోగకరంగా ఉండటమే కాదు.. మనిషి శ్రమను చాలా వరకు తగ్గిస్తోందనే చెప్పాలి. ఏ పనైనా సులభతరం చేసేందుకు టెక్నాలజీని వాడుతున్నాం. అలా టీవీ.. మొబైల్‌ ఫోన్లు.. ఏసీ.. ఫ్రిజ్‌లు.. ఇలా ఎన్నో ఉపకరణాలను ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. దేన్నైనా ఫ్యాక్టరీల్లో తయారు చేయవచ్చు. కానీ తినడానికి కావాల్సిన ఆహార పదార్థాలను మాత్రం శ్రమించి భూమిపై పండించాల్సిందే. అయితే ఆ శ్రమ తగ్గించే ప్రయత్నం చేస్తుందో జపాన్‌ కంపెనీ.
ఇప్పటి వరకు వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు కష్టపడి కూరగాయాలు.. పంటలు పండిస్తున్నారు. అయితే జపాన్‌లోని స్ప్రెడ్‌ అనే సంస్థ ప్రపంచంలోని తొలి రోబో నియంత్రిత వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసింది. జపాన్‌లోని కన్సాయ్‌ సైన్స్‌ సిటీలో 47,300 చదరపు అడుగుల ఫ్యాక్టరీలో దీన్ని ప్రారంభించారు. మనిషితో పని లేకుండా నీరు పోయడం నుంచి.. పంట కోతకోసే వరకు అన్నీ రోబోలే చేసేలా డిజైన్‌ చేశారు. అయితే విత్తనాలు మాత్రం మనిషి నాటాల్సి ఉంటుంది. మిగతా పనులన్నీ రోబో చేసుకుంటుంది. ఇందులో తొలత పాలకూరను పండిస్తున్నారు.
2017లో తొలి దిగుబడి అందేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. దీని ద్వారా వ్యవసాయ కూలీల ఖర్చు 50శాతం మేర తగ్గుతుందని చెబుతున్నారు. అంతేకాదు.. పంట పండించేందుకు అయ్యే ఖర్చులో 25 శాతం పొదుపు అవుతుందట. దీని ద్వారా తక్కువ ఖర్చుతో పంటలు పండించగలమన్న విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడైన స్థానికంగా పెరిగే పంటలను సైతం మా ఫ్యాక్టరీలో తక్కువ ఖర్చులో పండించగలమని చెబుతున్నారు. ఈ పద్ధతి పూర్తిగా విజయవంతమై.. అన్నీ దేశాల్లో ప్రారంభిస్తే.. ఆహార ఉత్పత్తిలోటులో కొంత మేరైనా తీరే అవకాశముంది.

0 comments: