కోహినూర్ వజ్రం మనదే: పాక్ కోర్టులో పిటిషన్
Judagiri |Updated|February 11-2016
లాహోర్: ప్రస్తుతం బ్రిటన్ రాణి కిరీటంలో ధగధగలాడే కోహినూర్ వజ్రం
ఎవరిది? అంటే.. అందరి సమాధానం భారత్‌దేనని వస్తుంది. కానీ.. ఆ వజ్రం
పాకిస్థాన్‌దేనంటూ వాదిస్తున్నారు అక్కడి ఓ న్యాయవాది. కోహినూర్ వజ్రం
పాకిస్థాన్‌దేనని, ఆ వజ్రాన్ని పాక్‌కు తీసుకువచ్చేలా దాఖలైన ఓ పిటిషన్‌ను
పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్ర లాహోర్ కోర్టు విచారణకు స్వీకరించింది.
ఈ పిటిషన్‌ను జావేద్ ఇక్బాల్ జాఫ్రీ అనే న్యాయవాది దాఖలు చేశాడు. కాగా,
‘అప్పటి అవిభాజిత పంజాబ్ రాష్ర్టాన్ని పాలించిన మహారాజా రంజిత్‌సింగ్ మనవడు
దిలీప్‌సింగ్ నుంచి కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ తీసుకెళ్లింది. ఇంకా
చెప్పాలంటే ఎత్తుకెళ్లింది. అప్పుడు ఎలాంటి చట్టాలు లేవు. కాబట్టి న్యాయంగా
ఆ వజ్రం పాకిస్థాన్‌కు చెందాల్సిందే' అని తన పిటిషన్‌లో న్యాయవాది
పేర్కొన్నాడు.
Pak court accepts please to bring back Kohinoor diamond from UK
అంతేగాక, 1953లో జరిగిన పట్టాభిషేకం సందర్భంగా కోహినూర్ వజ్రం ఉన్న
కిరీటాన్ని బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 అలంకరించారు' అని జాఫ్రీ తన పిటిషన్‌లో
తెలిపాడు. తొలుత ప్రతివాదిగా బ్రిటన్ రాణిని కోర్టు పేర్కొనడంతో కోర్టు
కేసును కొట్టివేసింది. మళ్లీ మార్పులతో పిటిషన్ వేయడంతో కోర్టు విచారణకు
అంగీకరించింది.
కోహినూర్‌పై తాను ఇప్పటివరకు బ్రిటన్ రాణికి, పాకిస్థాన్ ప్రభుత్వానికి 786
లేఖలు రాశానని కూడా పేర్కొన్నారు. ఇంతకాలం ఈ వజ్రం మనదని వాదిస్తున్న భారత
ప్రభుత్వం పాక్ వాదనకు ఏం సమాధానం ఇస్తుందో వేచి చూడాలి.
0 comments:
Post a Comment