Does men think about sex for Every 7 seconds...!

పురుషులు ప్రతి 7 సెకండ్లకు ఒకసారి సెక్స్ గురించి ఆలోచిస్తారా..?

Neo world |Updated |Augist -16-2016

Sexual Problems and Solutions Leave a comment ....


  • *పురుషుల్లో లైంగిక వాంఛలు కొంత ఎక్కువన్న మాట నిజమేగానీ.. వాళ్లు రోజంతా దాని గురించే ఆలోచిస్తుంటారన్నది పూర్తిగా అపోహే! ఇదసలు అసాధ్యం కూడా. అయితే అవకాశం ఉన్నప్పుడు, వీలున్నప్పుడల్లా పురుషుడు సెక్స్‌ గురించి ఆలోచించే అవకాశం లేకపోలేదు.
* ఉదాహరణకు పురుషుడు కూర్చుని చదువుకుంటుంటే.. ఆ పక్క నుంచి ఓ స్త్రీ వెళుతోందనుకోండి.. చదివేది ఆపి.. ఆమె వంక ఓసారి తేరిపారజూసి, మళ్లీ పుస్తకంలో తలదూర్చొచ్చు! ఇది సహజం. ఇందుకు ఆమె అందంగానే ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇందులో సెక్స్‌ కోరిక లేకపోవచ్చుగానీ ఇది ప్రకృతిపరంగా పురుషుల సహజాతం. పురుషుల్లో స్త్రీల పట్ల ఆసక్తి, స్త్రీ గురించీ, సెక్స్‌ గురించీ ఆలోచించటమన్నది ఈ జాతి వృద్ధికి
అవసరమైన, జీవ పరిణామంలో అబ్బిన లక్షణంగా చెప్పుకోవచ్చు.

* సెక్స్‌ భావనలన్నవి ఇతర ఇంద్రియ ప్రేరణల తర్వాతే.. అంటే దృశ్యం, శబ్దం, స్పర్శ, వాసనల వంటి ఇతర ఇంద్రియాలకు సంబంధించిన సమాచారం అందిన తర్వాతే.. శృంగార భావనలు తలెత్తుతాయి. పురుషులకు ఇలాంటివి గ్రహించే గుణం సహజంగానే ఎక్కువ. కాబట్టి వీరు స్త్రీ సంబంధ సంకేతాలకు త్వరగా ఆకర్షితులవుతారు.
* ప్రకృతి సహజమైన ఈ ఏర్పాటు వెనకున్న లక్ష్యం  సంతానాభివృద్ధీ, జాతి మనుగడలే.

COMMENTS: Please share this post and tweet to your choice.

                                                                   * Written by Neo World

Next Post: -

స్త్రీలతో పోలిస్తే పురుషులకు సెక్స్‌ ఆలోచనలు ఎక్కువా?

- http://judagiri.blogspot.in


0 comments: