Q :-నాకు కాబోయే భర్తకు నా గత సెక్స్ అనుభవం తెలుస్తుందా...?
Neo world | Updated | August -08-2016
Sexual Problems and Solutions Leave a comment ....
ప్రశ్న : నేను ఇంటర్ వరకు చదివి ప్రస్తుతం ఒక ఇంటర్నెట్ సెంటర్‌లో ఉద్యోగం చేస్తున్నారు. సత్తుపల్లి పక్కన చిన్న పల్లెటూరు మాది. ప్రస్తుతం నా వయస్సు 19 సంవత్సరాలు. మా ఊరికే చెందిన సయ్యద్ అంటే నాకు ఇష్టం. అతడికి కూడా నేను అంటే ఇష్టం. ఇద్దరం ప్రేమించుకున్నాం. అతడి వయస్సు 25 సంవత్సరాలు. అతను సత్తుపల్లిలో రూంలో ఉంటున్నాడు. నేను ఉద్యోగ రీత్య సత్తుపల్లి రోజు వస్తున్నాను.
* ఆ క్రమంలో అతడి రూంకు అప్పుడప్పుడు వెళ్తూ ఉండేదాని. ఆ సమయంలోనే అతడు బలవంతం పెట్టడంతో పాటు, నాకు సయ్యద్ అంటే ఇష్టం ఉండటం వల్ల సెక్స్‌కు ఒప్పుకున్నాను. చాలా సార్లు మేము ఇద్దరం సెక్స్‌లో పాల్గొన్నాము. ప్రెగ్నెన్సీ రాకుండా ఏవో ట్యాబెల్ట్ ఇచ్చే వాడు వాటిని నేను వేసుకున్నాను. ఇప్పుడు మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నాకు సయ్యద్ అంటే ఇష్టం. కాని మతాలు వేరు కావడం వల్ల మా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో మా పెళ్లికి ఒప్పుకోరు.
* లేచి పోదాం అంటే నాకు ఇద్దరు చెల్లెలు ఉన్నారు. వారి జీవితాలపై ఆ ప్రభావం పడుతుంది. అందుకే పెద్దలు చూసిన సంబందంను చేసుకోవాలనే ఉద్దేశ్యంతో గత కొన్ని నెలలుగా సయ్యద్‌కు దూరంగా ఉంటున్నాను. అంతా బాగానే ఉండగా నా స్నేహితురాలు కొత్తగా పెళ్లి అయిన సమయంలో భార్యకు ముందే అనుభవం ఉందా అనే విషయం భర్తలకు తెలుస్తుందని చెప్పింది. నిజంగానే అలా తెలుస్తుందా. అలా తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు నాకు ఇప్పుడు పెళ్లి అంటేనే భయంగా ఉంది.
సమాధానం : ప్రేమించుకోవడం అంటే తనవును అర్పించుకోవడం కాదు. మీరు ప్రేమించుకున్నాం అన్నారు కాని, అది నిజం కాదు. ప్రేమించుకుంటే శృంగారం కోరుకోరు. శృంగారం కోసమే మీరు ఇద్దరు కూడా ప్రేమను నటించారు. అతను ముఖ్యంగా మీపై మోహంతోనే ప్రేమను నటించాడు. ఇక మీరు కూడా అతడి మాయ మాటలకు పడిపోయి మోసపోయారు. అంతా అయిన తర్వాత ఇప్పుడు భయపడుతున్నారు. ఈ విషయంపై మీరు ముందే ఆలోచించాల్సింది. అతడిని పెళ్లి చేసుకునే వీలు లేనప్పుడు సెక్స్‌లో ఎలా పాల్గొన్నారు. అప్పుడు మీ చెల్లెల విషయం గుర్తుకు రాలేదా.. ?
* సరే జరిగిందేదో జరిగింది, మీ స్నేహితురాలు చెప్పినట్లుగా ఏమీ
జరగదు. మీకు కాబోయే భర్తకు మీ గత అనుభవం గురించి తెలిసే ఛాన్స్‌లేదు. లేని
పోని భయాలతో అతడికి మీరే తెలియజేయకండి. ఇప్పటికి అయినా పెళ్లి చేసుకుని
భర్తతో సంతోషంగా ఉండండి. పెళ్లి తర్వాత పాడు పనులు చేయవద్దని నా సలహా.
మొదటి రాత్రి సమయంలో కొందరి రక్తం వస్తుంది. అలా వస్తేనే కన్నే అని
భావించడం అవివేకం.
* ప్రస్తుత కుర్రాలకు ఈ విషయం బాగా తెలుసు. మిమ్ముల పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తికి కూడా విషయం తెలిసే ఉంటుంది. అందుకే ఎలాంటి భయాలు పెట్టుకోకుండా పెళ్లి చేసుకుని జీవితాన్ని సంతోషంగా సాగించండి. ఇక జీవితంలో సయ్యద్ గురించి ఆలోచించకండి.
Comment :- మీకు Neo World పొస్ట్ లు నచ్చినట్లయితే share చెయ్యండి మరియు like చెయ్యండి ....
0 comments:
Post a Comment