కండోమ్‌ల గురించి కఠోర నిజం
* వివాహేతర శారీరక సంబంధాలకు దూరంగా ఉండని పక్షంలో సేఫ్ సెక్స్ కోసం ఉపయోగించాల్సిన కండోమ్‌ల వాడకంపై ఆశ్చర్యకర నిజాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్(నాకో) తాజాగా నిర్వహించిన ఓ ఆధ్యయనంలో ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
దేశంలో ఎయిడ్స్ ను నిర్మూలించేందుకు ప్రభుత్వమే ఉచితంగా కండోమ్స్ ని పంచింది. వీటి ఉపయోగం ఎలా ఉంది అనే విషయంలో తాజాగా ఈ స్టడీని నాకో నిర్వహించింది. ఉచిత కండోమ్‌ల అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నవారిలో గోవా, ఢిల్లీ జనాలు ముందున్నారని తేలింది. ఈ రాష్ట్రాల్లో 100 శాతం కండోమ్స్ ని వాడుకున్నట్లు నిర్దారణ అయింది. సెక్స్ వర్కర్స్, ట్రాన్స్ జెండర్స్ కి, ఫ్యామిలీ ప్లానింగ్ చేసే వాళ్లకి ఈ కండోమ్స్ బాగా ఉపయోగపడుతున్నట్టు సర్వేలో తేలింది!
నాకో సంస్థ చేస్తున్న సర్వేలో స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్లు కండోమ్స్ ను ప్రజలకు ఏ విధంగా సప్లై, డిస్ట్రిబ్యుషన్ చేస్తున్నారు అనే విషయాలపై కూడా దృష్టిపెట్టింది. ఈ సర్వే లో ఒక నెల ట్రాక్ రికార్డ్ చూస్తే 91,210 కండోమ్ లు సెక్స్ వర్కర్స్, ట్రాన్స్ జెండర్స్ లాంటి రిస్క్ ఉన్న సముదాయాలకు అందినట్లు తేలింది.
కండోమ్స్ వినియెగించిన రాష్ట్రాల్లో గోవా 100 శాతంతో ముందుండగా, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు 89 శాతం తో చివరిగా నిలిచాయి. ఈ స్టడీలో గోవా, వెస్ట్ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ, ఢిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, అస్సాం లాంటి రాష్ట్రాలను సెలెక్ట్ చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ లలో 94 శాతం కండోమ్స్ వాడినట్లు, మహారాష్ట్ర లో 89 శాతం, అస్సామ్ లో 91 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 89 శాతం మంది ఈ ఉచిత కండోమ్‌లను ఉపయోగించినట్లు తేలింది. మొత్తంగా అన్ని రాష్ట్రాల్లో చూస్తే 5 శాతం కన్నా తక్కువ కండోమ్స్ ను గవర్నమెంట్‌కు తిరిగి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఉచిత కండోమ్‌ల పంపకం, వాటి ఉపయోగం ద్వారా అయిన ప్రాణాంతక ఎయిడ్స్ వ్యాధి తగ్గుముఖం పడితే అంతకంటే ఆనందకరమైన విషయం మరేమీ లేదని నాకో అధికారులు వ్యాఖ్యానించారు.
Comments: Please share this post and tweet to your choice
0 comments:
Post a Comment