'ఫ్రీడమ్ 251' ఒక స్మార్ట్‌ఫోన్ కుంభకోణమా?
Judagiri| Updated: February 22, 2016 ....
అయితే, ఇలా నిలిపేయడంపట్ల సోషల్ మీడియాలో పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తమ సంస్థకు చెందిన ఫ్రీడమ్ 251 మొబైల్ ఫోన్లకు విపరీతంగా డిమాండ్ పెరగడంతో వాటిని తాత్కాలికంగా నిలిపేసి తిరిగి శుక్రవారం ప్రారంభిస్తున్నామని చెప్పింది. అయితే, శుక్రవారం ఈ ఫోన్ బుక్ చేసుకునే వారు కొన్ని విషయాలు ముందే తెలుసుకుంటే మంచిది.
బుక్ చేసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోండి .
1. రింగ్ బెల్స్ అనేది ఇప్పటి వరకు ఎలాంటి ట్రాక్ రికార్డు లేని ఓ
ఎలక్ట్రానిక్ సంస్థ. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ లో నాణ్యత ఎంతమేరకు ఉంటుందనే విషయం
అంచనా వేయడం సాధ్యం కాదు.
2. మొబైల్ ఫోన్ షిప్పింగ్ కు నాలుగు నెలలు సమయం పడుతుంది. ఇది దృష్టిలో ఉంచుకొని ఫోన్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, బుక్ చేసుకున్న వారందరికీ ఈ ఫోన్ డెలివరీ వస్తుందని మాత్రం అనుకోలేం.
3. ఫోన్ లాంచింగ్ సమయంలో ఫ్రీడమ్ 251 కు ఒక సంవత్సరంపాటు వారంటీ ఉంటుందని చెప్పింది. కానీ, వెబ్ సైట్లో మాత్రం రిటర్న్ పాలసీ వివరాలేవీ పెట్టలేదు.
4. ఫోన్ ధర రూ. 251 కాగా, చేరవేతకు అదనంగా రూ.40 చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తం రూ.291 చెల్లించాల్సి ఉంటుంది.
5. ఈ ఫోన్లు కేవలం భారత్ లో మాత్రమే డెలివరీ చేస్తారు. బయట దేశాల్లో ఉండే భారతీయులకు అందుబాటులో ఉండదు.
6.ఫోన్ ఆవిష్కరణ కార్యక్రమంలో అశోక్ చద్దా మాట్లాడుతూ మా ఫోన్ తయారీ ధర రూ.2,500. భారత్‌లో తయారు చేస్తే 13.8 సుంకం తగ్గడంతో, ఒక ఫోన్‌పై రూ.450 భారం తగ్గుతుందని, ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తాం కాబట్టి మరో రూ.450 కలిసొస్తుంది. భారీమొత్తంలో తయారీ వల్ల రూ.550 వరకు ఖర్చు తగ్గుతుందన్నారు.

7. ఇక మార్కెటింగ్, ఇ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో విక్రయం ద్వారా రిటైలింగ్
ఖర్చులు తగ్గించుకుంటామని. మొత్తంమీద రూ.800కే తయారు చేయగలమన్నది మా
విశ్వాసమని అన్నారు. రూ.251కి విక్రయిస్తే, రూ.550 తేడా ఉంటుందని,
ఆన్‌లైన్ ప్రకటనలు, ఇకామర్స్ పోర్టల్‌లో ఇతరులకు చోటు ద్వారా ఆ
మొత్తాన్ని ఆర్జిస్తామని చెప్పారు.
0 comments:
Post a Comment