ఓ అమెరికన్ డాక్టర్ చెప్పిన నిజం... భారతీయ మహిళల పరిస్థితి ఇది !
Judagiri |Updated |Feb 08-02-2016
ముంబై:
భారత్‌లో కేన్సర్ సంబంధ మరణాల్లో ఎక్కువ శాతం సర్వికల్ కేన్సర్ వల్ల
సంభవిస్తున్నవే. 1997 నుంచి ఇప్పటివరకు ప్రతీ ఏడాదీ సగటున 72 వేల మంది
కేన్సర్ బారిన పడి చనిపోతున్నారు. అయితే వీరిలో దాదాపు 254 మంది కేన్సర్
కోసం జరిపే పరిశోధనల వల్ల చనిపోతున్నట్టు ఓ అమెరికన్ డాక్టర్ పేర్కొన్నారు.
సర్వికల్ కేన్సర్‌పై తమ పరిశోధనల కోసం పేదలను ఎన్నుకుంటున్న సంస్థలు
వారిపై సరైన పరీక్షలు నిర్వహించకుండానే ప్రయోగాలు చేస్తున్నారని
చెప్పుకొచ్చారు. ఇవే వారి మరణానికి కారణమని పేర్కొన్నారు.
అమెరికన్
పాథాలజిస్ట్, వైద్య విలువల ప్రతిపాదికుడు అయిన డాక్టర్ ఎరిక్ సుబా
భారత్‌లో సర్వికల్ కేన్సర్‌పై పరిశోధన చేశారు. 1997, 2012లో ఆయన మూడు
అధ్యయనాలు నిర్వహించారు. ఆయన పరిశోధనల కోసం యూఎస్ నేషనల్ కేన్సర్
ఇనిస్టిట్యూట్, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ నిధులు సమకూర్చాయి.
ముంబైలోని టాటా మొమోరియల్ హాస్పిటల్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో
సర్వికల్ కేన్సర్‌పై అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా 363,553 మంది స్త్రీలను
ఎన్నకున్నారు. వీరంతా ముంబైతోపాటు మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా,
తమిళనాడులోని దిండిగల్‌కు చెందిన అల్పాదాయ వర్గ పేదలు. అయితే ఈ
అధ్యయనాలన్నీ శాస్త్రీయంగా అసంబద్ధమైనవే కాకుండా విలువలను ప్రశ్నించేవిగా
ఉన్నాయంటూ డాక్టర్ సుబా అన్నారు. తను జరిపిన మూడు పరిశోధనలపై వివరిస్తూ ఈ
నెల 4న ముంబైలోని కేఈఎం ఆస్పత్రిలో ప్రసంగించేందుకు రెండు రోజుల ముందు ఓ
ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘నా ఉద్దేశంలో ఈ అధ్యయనాలన్నీ21వ శతాబ్దంలోనే
అతి పెద్ద సైన్స్ మోసాలు’ అంటూ వివాదాస్పద ఆరోపణలు చేశారు. అయితే టాటా
మెమోరియల్ ఆస్పత్రి వైద్యులు అతని ఆరోపణలకు దీటుగా బదులిచ్చారు. సర్వికల్
కేన్సర్‌పై జరుపుతున్న పరిశోధనలు అనైతికం కాదని తేల్చిచెప్పారు. సర్వికల్
కేన్సర్ పరీక్షల్లో తాజా పరిశోధన ఫలాలను ప్రపంచ వ్యాప్తంగా అమలుచేసే
అవకాశం ఉందని వారు వివరించారు.
0 comments:
Post a Comment