నమ్మ లేని నిజాలు
Judagiri |Updated |10-2016..
పోయిన వారాంతం లో
“అన్ బిలీవబుల్ ఫాక్ట్స్” అని ఒక పుస్తకం నేను చదివాను…వాటిలో కొన్ని నమ్మ లేని నిజాలు మీ కోసం…
- బొద్దింక తల లేకుండా వారం రోజులు బతక గలదట.
- భూమి పుట్టినప్పటి నుండి, ఇప్పటి వరకు వున్న కాలాన్ని ఒక సంవత్సరం అనుకుంటే, మనిషి పుట్టింది డిసెంబర్ 31,రాత్రి 8.30 కట.
- భూమి గుండ్రంగా లేదు, బల్ల పరుపుగా ఉంది అని నమ్మి, వాదించే వాళ్ళు..ఒక 18 ఏళ్ళ ముందు వరకు బతికే ఉన్నారట.
- మన మెదడు నిద్ర పోయెప్పడు, టీ వీ చూసేప్పటి కంటే చురుగ్గా పని చేస్తుందట.
- ప్రపంచం మొత్తంలో ఒక రోజు తినే అన్నం ఈజిప్ట్ గ్రేట్ పిరమిడ్ అంత
ఉంటుందట (ఇక్కడ అన్నం పరిమాణం కన్నా, ఈజిప్ట్ పిరమిడ్ అంత పెద్దగా ఉంటుందా
అని అశ్చర్యపోయాను)
- సింగపూర్ అంటే ల్యాండ్ ఆఫ్ లయన్స్ అని అర్ధం అట. కానీ అక్కడ ఒక్క సిం
హం కూడా ఉండదట.అన్నట్టు సింగపూర్ లో చ్యు యింగ్ గం తినడం నేరమట (వివిద
దేశాలలో ఇలాంటి వింత నేరాల లిస్ట్ చాలానే వుంది. మన దేశం లో చాలా బెట్టర్
అనిపించింది)
- 3 వేల మైళ్ళకి పైనే వున్న చైనా గోడ మనం అంతరిక్షంలోకి వెళ్ళినా భూమి
పైన గుర్తు పట్టెలా ఉంటుందట.అసలు ఎన్నో వేల జీవితాలు, ఆ గోడ మీదనే పుట్టి,
పెరిగి, దాన్నే కాపలా కాసి, అక్కడే అంతం అయిపోయాయట. అంటే వాళ్ళ జీవితం
కేవలం ఆ గోడకే అంకితం.
- రోదసిలో ఉన్న వ్యొమగాములు ఏడవలేరట. వాళ్ళకి గురుత్వాకర్షణ లేక అసలు
కన్నీళ్ళు రావట.అలాగే వ్యోమగామి గుండె సంకుచించి పరిమాణం చిన్నది అవుతుందట.
- మన జీవిత కాలంలో మనం 3 ఏనుగులు బరువు వున్న అన్నం తింటామట.
- ఆకాశంలో చుక్కలన్నీ లెక్క పెట్టడానికి…సెకనుకి ఒకటి చొప్పునా లెక్క పెట్టినా…3000 ఏళ్ళు పడుతుందట.
- ఇతర గ్రహ వాసులు తినేస్తారని, వాళ్ళ నుండి కాపాడుకోవాలని 25% అమెరికన్
లు ఇన్సూరెన్స్ చేయించుకుంటారట.90% అమెరికన్లు నాకు బిడియం ఎక్కువ అని
అనుకొంటారట, 60% పైనే దెయ్యాలు వున్నాయని నమ్ముతారట.
మీ సోషల్ నెట్‌వర్క్‌లో దీన్ని షేర్ చేయండి
దీన్ని షేర్ చేయండి
దీన్ని ట్వీట్ చేయండి
దీన్ని షేర్ చేయండి
0 comments:
Post a Comment