కరెంటునిచ్చే చెట్లు
Judagiri |Updated |February-22-2016
చెట్లు నీడనిస్తాయి. స్వచ్ఛమైన గాలినిస్తాయి. అంతేకాదు మధురఫలాల్ని అందిస్తాయి. ఈ చెట్లయితే కరెంటునిస్తాయి. చెట్లు కరెంటివ్వడమేంటీ అనుకుంటున్నారా? విండ్ ట్రీ, సోలార్ ట్రీల ప్రత్యేకత అదే. వాటి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం..
చీకటి
తొలిగిపోవాలన్నా, మరెన్నో పనులు జరగాలన్నా విద్యుత్ అవసరం. నీరు, గాలి,
బొగ్గు, సౌరశక్తి వంటి వనరులతో ప్రాథమికంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తాం.
విండ్, సోలార్ చెట్లు కూడా గాలి, సౌరశక్తిలను వినియోగించుకుని కరెంట్
అందిస్తాయి. ఇవి చూడటానికి చెట్లలానే ఉండే కృత్రిమ చెట్లు. ఫ్రాన్స్‌కు
చెందిన న్యూవిండ్ అనే సంస్థ విండ్ ట్రీలను తయారుచేసి కరెంటు ఉత్పత్తి
చేస్తోంది. ఈ విండ్ ట్రీని ఫ్రాన్స్‌లోని బ్రిటనీ నగరంలో ఏర్పాటు చేశారు.
గత దశాబ్ద కాలం నుంచే వివిధ దేశాల్లో సోలార్ ట్రీలు వినియోగిస్తున్నారు.
వీధి దీపాలు, మ్యూజియం, లైబ్రరీ, స్కూలు వంటి చాలా ప్రదేశాల్లో సోలార్
చెట్లను ఉపయోగిస్తున్నారు.
ప్రాథమిక
విండ్‌ట్రీ నమూనాను ఫ్రాన్సలోని బ్రిటనీ నగరంలో ఇటీవలే ఏర్పాటుచేశారు. ఇది
26 అడుగుల ఎత్తుంటుంది. గాలి ఏ దిశ నుంచి వీచినా ఇవి కరెంటును ఉత్పత్తి
చేస్తాయి. విండ్ ట్రీ చెట్ల ఆకులు గాలిమరల్లా పనిచేస్తాయి. చిరుగాలి
వీచినా ఆకులు తిరుగుతూ పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయని న్యూవిండ్
వ్యవస్థాపకుడు మిచాడ్ అంటున్నాడు. చూడ్డానికి ఎంతో అందంగా ఉండే
విండ్‌ట్రీలు అసలు శబ్దమే చేయవని, వీటిని ఎక్కడైనా పెట్టుకునే వీలుంటుందని
ఆయన పేర్కొన్నారు. వీధుల్లో, పార్కుల్లో వీటిని ఏర్పాటు చేసుకుంటే వీధి
దీపాలకు వీటిద్వారా ఉత్పత్తి అయ్యే కరెంటు వాడుకోవచ్చని, గృహవినియోగంలో
కూడా వీటిని ఉపయోగించుకోవచ్చని మిచాడ్ అంటున్నాడు. వీటి ధర 23 లక్షల
రూపాయలు.
సోలార్ ట్రీలను చాలా దేశాల్లో వినియోగిస్తున్నారు. సోలార్ చెట్లు సౌర శక్తి, పవన శక్తులను ఉపయోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. అన్ని కాలాల్లోనూ ఇవి సమర్థంగా పనిచేస్తాయి. స్టెయినలెస్ స్టీలు, మోల్డెడ్ ఫైబర్, రెయిన్ ఫోర్స్‌డ్ ప్లాస్టిక్‌లను ఉపయోగించి సోలార్ ట్రీలను తయారుచేస్తారు. ఇవి సరాసరి 50 నుంచి 75 అడుగుల ఎత్తుంటాయి. తక్కువ ఎత్తుండే సోలార్‌చెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. చెట్టు కింది భాగంలో బ్యాటరీ ఉంటుంది. సౌర, పవన శక్తి వల్ల ఉత్పత్తి అయిన విద్యుత్ బ్యాటరీలో నిక్షిప్తమవుతుంది. చెట్టుకు అమర్చిన మీటర్ సహాయంతో ఎంత విద్యుత్ స్టోర్ చేశామో తెలుసుకోవచ్చు. సోలార్ ట్రీలను గృహసముదాయాల్లో, వీధుల్లో, స్కూలు, ఇతర ప్రదేశాల్లో ఉపయోగించుకోవచ్చు.
విండ్ ట్రీ
- ఈ చెట్టుకు 63 ఆకులుంటాయి. వీటి ద్వారానే విద్యుత్ ఉత్పతి అవుతుంది.
- సంవత్సరానికి సరాసరి 3.1కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది.
- సంవత్సరంలో ఇది ఉత్పత్తి చేసే విద్యుత్‌తో ఎలక్ర్టిక్ కారు 1364 కిలోమీటర్లు ప్రయాణించగలదు. 15 వీధి దీపాలు వెలిగించవచ్చు.
0 comments:
Post a Comment