Consummation of marriage of a man suspected in the night ...

Neo world | Updated | Augist -16-2016

Sexual Problems and Solutions Leave a comment ....


                                    

* తొలిరాత్రి గదిలోకి అడుగుపెట్టిన జంటల మనసుల్లో అనేక అనుమానాలు ఉంటాయి. ముఖ్యంగా శోభనం రోజున లైంగికంగా కలవకపోతే అదొక పెద్ద అవమానం అన్నది మగవారి ఆలోచనగా ఉంటుంది. మరోవైపు శోభనపు తొలిరోజు లైంగిక అనుభవం ఎంతో బాధతో కూడినదని అమ్మాయిలు ఆందోళనలో ఉంటారు. 

* ఆ ఆందోళనలో ఉన్న అమ్మాయిలు సహజంగా చొరవ తీసుకునే యత్నం చేయలేరు. దీంతో ఆ అమ్మాయిలో తగినంత స్పందన లేకపోవడంతో... ఇంతకుముందే ఎవరినైనా ప్రేమించిందా.. లేదంటే నేనంటే ఇష్టం లేదా.. వంటి అనేక సందేహాలు మగవారిలో మొలకెత్తుతాయి.

* శోభనం గదిలోకి అడుగు పెట్టే ముందే మగవారు తమ మనసుల నుండి ఇటువంటివన్నీ తీసెయ్యాలి. అంతేకాదు మరో రెండు అపోహలను కూడా వదిలి వేయాలి. వాటిలో మొదటిది.. అంగ పరిమాణం, రెండోది లైంగికంగా భాగస్వామిని కలిసినప్పుడు కన్నెపొర చిరగాలనేవి. 

* మొదటి అపోహ గురించి చూస్తే.. స్త్రీలను సంతృప్తిపరిచేందుకు పురుషాంగం సైజుకు సంబంధమే లేదు. యోని లోతు ఆరు అంగుళాలు మించదు. అందులో తొలి రెండు అంగుళాల భాగంలో మాత్రమే కామ నాడులు దండిగా ఉండి లైంగికానుభూతుల్ని గ్రహిస్తాయి. మిగిలిన నాలుగు అంగుళాల లోతు ఏ భావం అందించదు. కనుక పైనున్న ఆ రెండు అంగుళాల పరిధిలోని నాడుల్ని తాకితే చాలు.. స్త్రీలో తృప్తి బయలుదేరుతుంది. 

* మరొక విషయం ఏమిటంటే... రతి చేసేటపుడు అంగపరిమాణం ముఖ్యం కాదు.. ఎంతసేపు అంగం స్తంభనలో ఉంటుందన్నదే ముఖ్యం. ఇది తెలుసుకుని శోభనపు తొలిరాత్రి సెక్స్‌లో పాల్గొన్నవారికి ఆ రేయి సుఖాల స్వర్గమే అవుతుంది. ఇక తొలిరేయి కలయికలో రక్తం చిందించాలనేది అర్థం లేని నమ్మకం. స్త్రీల లైంగికావయంపై ఉండే పలుచని పొర లైంగిక సంపర్కం లేకపోయినా తెగిపోతుంది. కనుక ఇటువంటివాటిని గురించి అతిగా ఆలోచించి శోభనపు రాత్రులను నిస్సారం చేసుకోకూడదు.

COMMENTS: Please share this post and tweet to your choice.

                                                                   * Written by Neo World

Next Post: -

మల్లెపూలు పెట్టుకుంటేనే సెక్స్ చేస్తాడు... ఇదేమైనా బలహీనతా...?

- http://judagiri.blogspot.in

0 comments: